e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home రంగారెడ్డి పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరం

పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరం

పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరం

యాచారం, జూన్‌1: పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్‌హాల్‌లో తహ సీల్దార్‌ నాగయ్య ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను 87మంది లబ్ధ్ది దారులకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఎంతో మంది పేద తల్లిదం డ్రులకు అండగా నిలిచాయన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుని కరోనా బారినుంచి కాపాడుకోవాలని ఆయన సూచించారు. కరోనా బాధితులకు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. బాధితులను దవాఖానకు తీసుకెళ్లేందుకు ఎంకే ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో 3 అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటిం చారు. జిల్లాలోనే షాద్‌నగర్‌ తరువాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధికంగా వరి పండిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నియోజకవర్గంలో నాలుగు లక్షల బస్తాలను అందజేసినట్లు తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న రైస్‌ మిల్లులకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. అవసరమైతే సీజ్‌ చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరిం చారు. రైతులు ఏమాత్రం అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

మైనింగ్‌జోన్‌ ముచ్చటే లేదు
మండలంలో కాంగ్రెస్‌ హయాంలో మైనింగ్‌జోన్‌ 600 ఎకరాల్లో ఏర్పాటయ్యిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యాచారం, మొండిగౌరెల్లి గ్రామాలకు అన్యాయం జరిగే మైనింగ్‌ జోన్‌ రానిచ్చే ప్రసక్తేలేదన్నారు. ఇప్పటికే అధికారులతో చర్చించామన్నారు. రైతులకు ఇబ్బందికరంగా ఉన్న క్రషర్లను సైతం ఇక్కడి నుంచి తరలించేందుకు కృషి చేస్తామన్నారు. క్రషర్లకు సర్పంచ్‌లు అనుమతులు ఇవ్వొద్దని సూచించారు. మొండిగౌరెల్లి గ్రా మానికి చెందిన రైతులు మైనింగ్‌జోన్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత
నల్లవెల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్యకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన రూ. 32వేల చెక్కును ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి బాధితుడికి అందజేశారు.కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగ మ్మ, తహసీల్దార్‌ నాగయ్య, ఎంపీడీవో మమతాబాయి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరం

ట్రెండింగ్‌

Advertisement