e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home రంగారెడ్డి ప్రజా సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

ప్రజా సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

ప్రజా సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

షాద్‌నగర్‌టౌన్‌, మే 11 : ప్రజా సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నటరాజ్‌ అన్నారు. మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన పెంటయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైనా రూ.60వేల చెక్కును మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కు అందజేయడంపై సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అశోక్‌, శ్రీశైలం, మల్లేశ్‌, సుధాకర్‌, హన్మంత్‌ పాల్గొన్నారు.
పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ అండ
నందిగామ,మే 11 : ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండగా నిలుస్తున్నదని జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ అన్నారు. మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన పాలకొండ శ్రీనివాస్‌గౌడ్‌కు రూ.40వేలు, పోమల జంగయ్యకు రూ.29వేలు చెక్కులు సీఎం రిలీఫ్‌ ద్వారా మంజూరైన చెక్కులను జడ్పీ వైస్‌ చైర్మన్‌, అప్పారెడ్డిగూడ సర్పంచ్‌ నర్సింహులు, వీర్లపల్లి ఎంపీటీసీ లతతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత
మంచాల, మే 11 : నోముల గ్రామానికి చెందిన పల్నాటి రాములు, గంట జంగయ్య, చింతకింది సతీష్‌కు మంజూరైన చెక్కులను మంగళవారం సర్పంచ్‌ బాల్‌రాజ్‌ అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరేశం, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు యాదగిరి, నాయకులు జంటయ్య, బుచ్చిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజా సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

ట్రెండింగ్‌

Advertisement