e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home రంగారెడ్డి మహా ప్రగతి.. విశ్వ ఖ్యాతి

మహా ప్రగతి.. విశ్వ ఖ్యాతి

  • మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
  • విశ్వనగరంలో కనీవినీ ఎరుగని రీతిలో పనులు
  • ఆరేండ్లలో రూ.67,035.16 కోట్లతో భారీగా మౌలిక సదుపాయాలు
  • జీహెచ్‌ఎంసీతోనే రూ.32,532.87 కోట్ల మేర వ్యయం
  • ఎస్‌ఆర్‌డీపీతో ట్రాఫిక్‌ పద్మవ్యూహానికి అధునాతన పరిష్కారం
  • ఇప్పటికే 18 చోట్ల వాహనదారులకు తప్పిన ట్రాఫిక్‌ కష్టాలు
మహా ప్రగతి.. విశ్వ ఖ్యాతి

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్‌ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభివృద్ధి మంత్రాన్ని జపించడం పరిపాటి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధిని 24*7 కొనసాగించడమనేది అత్యాశే. కానీ తెలంగాణ సర్కారు గతానికి భిన్నంగా హైదరాబాద్‌ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. గత ఆరేండ్లకు పైగా రూ.67,035.16 కోట్ల పనులతో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు సమకూర్చింది. వాస్తవంగా గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌ను కాసులు కురిపించే బంగారు బాతుగానే పరిగణించి.. వచ్చినకాడికి పిండుకున్నారు.

కానీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాల్లో లేనివిధంగా మౌలిక సదుపాయాల కల్పనతో నగరంలో సమగ్రాభివృద్ధి జరిగింది. దీంతో నగరవాసుల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు.. కొన్ని పనులు శాశ్వత ఆస్తులు (పర్మినెంట్‌ అసెట్స్‌)గా మారాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో గత ఆరేండ్లకు పైగా నగరంలో ప్రణాళికాబద్ధంగా సాగుతున్న అభివృద్ధిని పరిశీలిస్తే…

- Advertisement -

g ఉమ్మడి పాలనలో కరెంటు రాక అనేది ఒక వార్తగా ఉండేది. ఇప్పుడు కరెంటు పోక అనేది వార్తగా తయారైంది. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఈ మహా నగరంలో పారిశ్రామికవేత్తలు రోడ్లపైకి వచ్చి కరెంటు కోసం ధర్నాలు చేసిన చీకటి రోజులు ఉన్నాయి. కానీ రూ.2,374.36 కోట్లతో కొత్త సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు కొత్త లైన్లతో గ్రేటర్‌ విద్యుత్‌ వ్యవస్థ సమూలంగా బలోపేతం చేశారు. తద్వారా ఇప్పుడు రెప్పపాటు కాలం కూడా కరెంటు పోవడం లేదు.
g ప్రజా రవాణా అనేది కనీస ధర్మమని గుర్తెరిగిన ప్రభుత్వమిది. అందుకే నష్టాల్లోనూ సిటీ బస్సులను నడుపుతున్న ప్రభుత్వం ఆ మేరకు ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ద్వారా ఒక ఏడాది రూ.156.59 కోట్లు బదిలీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఆపై కార్పొరేషన్‌ కూడా ఆర్థికంగా కుంగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఆర్టీసీకి నేరుగా నిధులిచ్చి ప్రజా సంస్థను పరిరక్షిస్తున్నది. తాజా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్ల కేటాయింపులు చేసి ప్రజల సంస్థను కంటికి రెప్పలా కాపాడుతున్నది.

g ఉమ్మడి పాలనలో హైదరాబాద్‌ను కాంక్రీట్‌ జంగిల్‌లా మార్చడం మినహా ఒక్క చెట్టును కూడా ఎదగినిచ్చిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అర్బన్‌ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు వందలాది పార్కులు, పర్యాటక అభివృద్ధి, కాల గమనంలో కలిసిపోతున్న చెరువులకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు వందలాది కోట్ల రూపాయలను వెచ్చించి లంగ్‌ స్పేస్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ తరహా ముప్పు రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంది.
g నగరంలో రహదారుల అభివృద్ధి, లింక్‌ రోడ్లు, వారసత్వ భవనాల పరిరక్షణ, నగరవాసులకు సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించడం ఇలా ఒకటేమిటి! అన్ని కోణాల్లోనూ నగరంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించింది.

g దేశంలోని ప్రతి మెట్రో నగరం తాగునీటి కొరతతో అల్లాడుతుండగా… సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో నగరవాసులకు పుష్కలమైన తాగునీరు అందుతున్నది. కుత్బుల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో పదిహేను రోజులకోసారి తాగునీరు అందే దుస్థితి నుంచి ఇప్పుడు నిత్యం సురక్షితమైన మంచినీరు అందే రోజులు వచ్చాయి.

మానవీయ కోణంలోనూ సదుపాయాలు..
అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, వేల కోట్ల రూపాయల వ్యయమే కాదు.. మానవీయ కోణాన్ని స్పృషించడమనేది తెలంగాణ ప్రభుత్వ గొప్పతనం. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించడంతో పాటు లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వస్తారు. ఈ నేపథ్యంలో మహా నగరంలో కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడమనేది చాలా పెద్ద సమస్య. దశాబ్దాలుగా ఈ సమస్యపై కనీసం ఆలోచించిన పాలకులు లేరు. దేశంలోని ఇతర నగరాల్లోనూ ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం నగరంలో ఏకంగా 12వేల టాయిలెట్స్‌ ఏర్పాటు చేయడమనేది దేశంలోనే రికార్డు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.

g నగరంలో ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా కూడళ్లు దాటడం అనేది సాధారణ వ్యక్తులకే సవాల్‌ వంటిది. ఈ క్రమంలో అంధులు సులువుగా కూడళ్లు దాటేందుకు జంక్షన్లలోని ట్రాఫిక్‌ వ్యవస్థలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. పాదచారులు కూడళ్లలో జీబ్రా లైనుపై నడిచేందుకు ఇచ్చే సిగ్నలింగ్‌ సమయంలో ప్రత్యేకంగా బీప్‌ శబ్దం వస్తుండటంతో అంధులు ఎవరి సహకారం లేకుండానే కూడళ్లు దాటుతున్నారు. అంటే అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల లోతుల్లోకి వెళ్లి ప్రభుత్వం ఆలోచించడంతోనే అనేక సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయని పలువురు ప్రశంసిస్తున్నారు.

g వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ)ను రూ.25వేల కోట్లతో రూపొందించారు. ఇప్పటికే తొమ్మిది ఫ్లైఓవర్లు సహా పద్దెనిమిది నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.4,780.43 కోట్ల విలువైన 20 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.1,315 కోట్ల విలువైన మూడు పనులకు పాలనా అనుమతులు రాగా… రూ.7800 కోట్ల విలువైన నాలుగు నిర్మాణాలకు డీపీఆర్‌లు పూర్తయ్యాయి. రూ.12,044 కోట్లతో మరో పదమూడు పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఎస్‌ఆర్‌డీపీలో పూర్తయిన 18 ప్రాజెక్టులు ఇవే..
హైదరాబాద్‌ నగరాన్ని సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చే క్రమంలో భాగంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు 18 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. రూ.1010.77కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తయిన ఈ పనుల్లో తొమ్మిది ఫ్లై ఓవర్లు, నాలుగు అండర్‌పాస్‌లు, మూడు ఆర్వోబీలు, ఒక కేబుల్‌ బిడ్జ్రి ఉన్నాయి..

నగర పౌరులకు అందుబాటులోకి వచ్చినవి
రూ. 49.69 కోట్ల వ్యయంతో అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్‌
రూ.131.25 కోట్లతో చేపట్టిన మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌
రూ.13.25 కోట్ల వ్యయంతో చేపట్టిన చింతలకుంట చెక్‌పోస్టు అండర్‌పాస్‌
రూ.23.20 కోట్లతో చేపట్టిన కామినేని జంక్షన్‌ ఫ్లై ఓవర్‌
రూ.20.74 కోట్లతో నిర్మించిన ఎల్బీనగర్‌ ఎడమ వైపు ఫ్లై ఓవరు
రూ. 97.94 కోట్లతో రాజీవ్‌గాంధీ విగ్రహం ఫ్లై ఓవర్‌
రూ.30.26 కోట్లతో బయో డైవర్సిటీ గ్రేడ్‌ వన్‌ సపరేటర్‌
రూ. 17.07 కోట్లతో ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్‌
రూ.23.20 కోట్లతో కామినేని కుడివైపు ఫ్లై ఓవర్‌
రూ.5.95 కోట్లతో చట్నీస్‌ పంజాగుట్ట వద్ద రోడ్డు విస్తరణ
రూ. 20.27 కోట్ల వ్యయంతో ఉప్పుగూడ ఆర్‌యూబీ
రూ. 38.18 కోట్ల వ్యయంతో బైరామల్‌గూడ కుడివైపున ఫ్లై ఓవర్‌
రూ.150 కోట్ల వ్యయంతో పూర్తయిన దుర్గం చెరువు నాలుగు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ g రూ. 184 కోట్లతో చేపట్టిన దుర్గం చెరువు కేబుల్‌ స్టెయిడ్‌ బ్రిడ్జి g రూ. 5.85 కోట్లతో లాలాపేటలోని ఆర్‌యూబీ పునరుద్ధరణ g రూ. 29.39 కోట్లతో ఉత్తమ్‌నగర్‌ ఆర్‌యూబీ నిర్మాణం
రూ. 4741.97 కోట్ల వ్యయంతో చేపట్టిన 20 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.

ఘన వ్యర్థాల నిర్వహణ
వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తి రూ.455 కోట్లు
వ్యర్థాలను శాస్త్రీయంగా నిక్షిప్తం చేయడం – రూ.779.80 కోట్లు
క్యాపింగ్‌ – రూ.200 కోట్లు, లీచెట్‌ ట్రీట్‌మెంట్‌ – రూ.200 కోట్లు
స్వచ్ఛ ఆటోలు – రూ.100 కోట్లు
అన్నపూర్ణ (రూ.5 భోజనం) – రూ.152.03 కోట్లు
డబుల్‌ బెడ్‌రూం – రూ.9,700 కోట్లు (98వేల యూనిట్లు)

ప్రత్యేకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా అభివృద్ధి – రూ.32,532.87 కోట్లు అందులో ప్రధానమైనవి…
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) – రూ.8,410.00 కోట్లు
ఫ్లైఓవర్లు – 46, వెహికల్‌ అండర్‌ పాసింగ్‌ – 7, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు – 4, రోడ్డు అండర్‌ బ్రిడ్జిలు – 5, జంక్షన్లు – 46
సమగ్ర రహదారుల నిర్వహణ ప్రాజెక్టు (సీఆర్‌ఎంపీ) – రూ.1,839 కోట్లు – 709.490 కిలోమీటర్లు
వాననీటి డ్రెయిన్లు – రూ.589.40 కోట్లు
నాలాల అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ (భూసేకరణ) – రూ.3,316.57 కోట్లు
పట్టణ జీవ వైవిధ్యం – రూ.250 కోట్లు – థీమ్‌ పార్కులు – 67, ట్రీ పార్కులు – 517, పార్కుల నిర్వహణ – 917

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహా ప్రగతి.. విశ్వ ఖ్యాతి
మహా ప్రగతి.. విశ్వ ఖ్యాతి
మహా ప్రగతి.. విశ్వ ఖ్యాతి

ట్రెండింగ్‌

Advertisement