మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:26:36

మీడియా ఇన్‌చార్జిగా రాంరెడ్డి

మీడియా ఇన్‌చార్జిగా రాంరెడ్డి

 బడంగ్‌పేట : బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ సోషల్‌ మీడియా ఇంచార్జీగా రామిడి రాంరెడ్డి నియమితులయ్యారు. శనివారం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నియామక పత్రం అందజేశారు. అన్ని విభాగాలకు కమిటీలను పూర్తి స్థాయిలో వేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులకు, నియోజకవర్గ పార్టీ శ్రేణులకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్‌, పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, బీమిడి జంగారెడ్డి, కర్రె బల్వంత్‌, లిక్కి కృష్ణారెడ్డి, రాళ్ళగూడెం శ్రీనివాస్‌రెడ్డి, కర్రె బల్వంత్‌, పెద్దబావి సమర సింహారెడ్డి, తుఫాన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.