గురువారం 22 అక్టోబర్ 2020
Rangareddy - Aug 10, 2020 , 00:01:48

రామచంద్రారెడ్డి ఫిల్లింగ్‌ స్టేషన్‌ ప్రారంభం

రామచంద్రారెడ్డి ఫిల్లింగ్‌ స్టేషన్‌ ప్రారంభం

బడంగ్‌పేట, ఆగస్టు9 : బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీశ్రీహోమ్స్‌ దగ్గర రామచంద్రారెడ్డి ఫిల్లింగ్‌ స్టేషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌ 24వ వార్డు కార్పొరేటర్‌ ఏనుగు రాంరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తన తండ్రి రాంచంద్రారెడ్డి పేరు మీద ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏ ర్పాటు చేయడం సంతోషమన్నారు. ఉపాధి అవకాశాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న, కవిత, శేఖర్‌రెడ్డి, లలితకృష్ణ, శ్రీధర్‌రెడ్డి, సునీత, ప్రభాకర్‌రెడ్డి, మనోహర్‌, బాలు, బీమిడి స్వప్న, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఏనుగు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సాంబశివ పాల్గొన్నారు. 

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

ఆపదలో ఉన్న వారికి సీఎం కేసీఆర్‌ ఆపన్న హస్తం అందిస్తున్నారని మంత్రి  సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన సుస్మితకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును మంత్రి అందజేశారు. ఆమె  మాట్లాడుతూ కష్టకాలంలో ఎవరైనా సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా సాయం అందుతుందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీల గురించి ఆలోచన చేస్తామన్నారు. గెలిచిన తర్వాత ప్రజలందరూ సమానమేనన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను అందరికి చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్‌ పెద్దబాయి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


logo