ధారూరు/వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్కు రాఖీ సందర్భంగా సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే కూతురు వినూత్న తన సోదరుడు వైభవ్ ఆనంద్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ద దీప, కౌన్సిలర్లు పుష్పలతరెడ్డి, పావని, మంజుల, ప్రవళిక, సంతోష, రాజ్యలక్ష్మి, సువర్ణ, సర్పంచ్ లలిత, బ్రహ్మకుమారిస్ ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా వికారాబాద్ నియోజక వర్గ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.