బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 09, 2020 , 23:54:48

వైద్యులకు ఫేస్‌షీల్డ్‌లు అందజేత

వైద్యులకు ఫేస్‌షీల్డ్‌లు అందజేత

కొండాపూర్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో భయపడకుండా సేవలందిస్తున్న వైద్యులకు తమ వంతు సాయంగా సత్యసాయి సేవా సమితి, శారద సేవా ట్రస్టు ప్రతినిధులు కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖాన వైద్య సిబ్బందికి ఫేస్‌షీల్డ్‌లను అందజేశారు. కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో ముందున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం తమ వంతు సహకారంగా ఫేస్‌షీల్డ్‌లను అందజేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. దవాఖానలో అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథ తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బీసీ రామన్న, కృష్ణకుమార్‌, హరనాథరెడ్డి, పీఎస్‌ బో స్‌, శ్రీలక్ష్మీ, కిశోర్‌ పాల్గొన్నారు.