మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 00:25:20

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత

 ఉప్పల్‌ : హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి అందజేశారు. హబ్సిగూడ డివిజన్‌కు చెందిన కమలమ్మకు రూ.16 వేలు, మధుకు రూ.31,500, బింధుప్రియకు రూ.25 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యసంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గరిక సుధాకర్‌, నందికంటి శివ, శ్రీధర్‌, రెహమాన్‌, అంజిరెడ్డి, వినీశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

మాజీ కౌన్సిలర్‌ నర్సింహ మరణం బాధాకరం 

 రామంతాపూర్‌ :  మాజీ కౌన్సిలర్‌ తూముల నర్సింహ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం రామంతాపూర్‌లో జరిగిన సంతాప సభలో పాల్గొని ఆయనకు  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ కౌన్సిలర్‌ ముత్యాల నర్సింహ, గడ్డం రవికుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శాగ రవీందర్‌, సూరం శంకర్‌, గరిక సుధాకర్‌, తదితరులు ఉన్నారు