గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Sep 02, 2020 , 00:10:04

రాష్ట్ర సాధనలో ప్రణబ్‌ కృషి మరువలేనిది

రాష్ట్ర సాధనలో ప్రణబ్‌ కృషి మరువలేనిది

బండ్లగూడ, సెప్టెంబర్‌1: రాష్ట్ర సాధనలో ప్రణబ్‌ ముఖర్జీ చేసిన కృషి మరువలేనిదని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ చనిపోవడంతో మంగళవారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రణబ్‌కు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కందుకూరు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి చెందడం తీరనిలోటని పలువురు నాయకులు, అధికారులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దాసర్లపల్లిలో సర్పంచ్‌ బాలమణి, ఉప సర్పంచ్‌ మంగాదేవి, వార్డు మెంబర్లు కృష్ణయ్య, యుగేందర్‌గౌడ్‌, శారద, రహీజ్‌, కృష్ణగౌడ్‌, దస్తగిరి, మహేశ్‌, అరవింద్‌, శశిధర్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.