ఆదివారం 25 అక్టోబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:59:01

పోలీస్‌స్టేషన్‌... ఓ హరితవనం

పోలీస్‌స్టేషన్‌... ఓ హరితవనం

పరవశింపజేస్తున్న పచ్చదనం 

800 మొక్కలు నాటి రక్షిస్తున్న పోలీసులు

కోట్‌పల్లి: కోట్‌పల్లి పోలీస్టేషన్‌ హరితవనంలా మారింది. ఆరు విడుతలుగా నిర్వహించిన హరితహారంలో భాగంగా 800 పైగా మొక్కలకు నాటి, కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇక్క డ పనిచేస్తున్న ఎస్‌ఐ వెంకటనారాయణ పలు గ్రామాలను దత్తత తీసుకొని ఒక్కో గ్రామంలో 500 మొక్కలను నాటించా రు. అలాగే పోలీస్‌స్టేషన్‌ ఆవరణ, పీఎస్‌ ఎదుట రోడ్డు కు ఇరుపులా మొక్కలు నాటారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ స్టేషన్‌ గ్రామానికి దూ రంగా ఉండడం.. కావల్సినంత ఖాళీ ప్రదేశం ఉండడం మొక్క లు పెంచేందుకు కలిసొచ్చింది. ప్రతి ఏడాది పోలీసులకు ఇచ్చిన హరిత లక్ష్యాన్ని పూర్తి చేసి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు  హరితహారంలో  నూ ముందున్నామని చాటిచెబుతున్నారు ఇక్కడి పోలీసులు. ఒకవేళ మొక్క ఎండిపోతే వెంటనే  తొలగించి ఆ స్థానంలో మరో మొక్కను పెంచుతూ  ఆదర్శంగా నిలుస్తున్నారు. 

మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం..

ప్రతి గ్రామంలో హరితహారం విజయవంతానికి కృషి చేశాం. పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేశాం.  అంతేకాకుండా వాటిని పెంచేందుకు సంరక్షకులను ఏర్పాటు చేశాం. భవిష్యత్తు తరాలకు మొక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నాం. 

-వెంకటనారాయణ, ఎస్‌ఐ కోట్‌పల్లిlogo