సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jun 14, 2020 , 04:09:57

దుక్కులు దున్నుతున్నరు..

దుక్కులు దున్నుతున్నరు..

సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న 

నియంత్రిత పంటలే వేస్తామంటున్న అన్నదాత

కందుకూరు/మహేశ్వరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన వ్యవసాయ విధానంతో తీసుకువచ్చిన నియంత్రి త పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మండలంలో సు మారు 47వేల ఎకరాలు ఉండగా ప్రతి ఏడాది నీరు, వర్షాలను బట్టి 26 వేల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. కానీ ఈ ఏడాది బీడు భూముల్లో కూడా  నియంత్రిత పంటలు వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ప్రతి రైతుకు  రైతుబంధు ద్వారా రూ. 10వేలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎకరానికి రూ. 6 వేలు అందిస్తుంది. గ్రామాల్లో రైతులు దుక్కులను దున్ని జొ న్నలు, పత్తి, కంది విత్తనాలను విత్తుతున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచామని అధికారులు తెలుపుతున్నారు. 

 పంట మార్పిడితో అధిక దిగుబడులు

మండలంలోని రైతులు నియంత్రిత పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.  భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, ఎంత పంటలో ఏయే మోతాదులో ఎరువులు వేయాలని  అవగాహన కల్పిస్తున్నారు.  చిరుధాన్యాలతో లాభాలు వస్తాయని వివరిస్తున్నారు.  మహేశ్వరంలో 36 వేల ఎకరాల్లో  రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. వానకాలం సమీపిస్తుండడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. 

 అందుబాటులో ఎరువులు

వానకాలం పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సహకార సంఘంలో అందుబాటులో ఉంచాం. రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో అనుమతి తీసుకొని ఎరువులు విత్తనాలను తీసుకోవాలి. రైతులకు రుణాలు అందజేస్తున్నాం.

- దేవరశెట్టి చంద్రశేఖర్‌,  పీఏసీఎస్‌ చైర్మన్‌

తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలి

వానకాలం పంటల సాగు సమయంలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలను విత్తుకోవాలి.  ఈ సీజన్‌లో మొక్కజొన్న పంటలకు బదులు వరి, పత్తి, జొన్న కంది, కూరగాయల పంటలను సాగు చేసుకోవాలి. రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి

   - శైలజ, వ్యవసాయాధికారి,కందుకూరు

చిరుధాన్యాలు సాగుచేయాలి

రైతులు నియంత్రిత పంటలు  సాగుచేసుకోవాలి. వ్యవసాయాధికారులు సూచించిన పంటలను పండించుకోవాలి. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వస్తాయి. చిరుధాన్యాలను సాగుచేసుకోవాలి.

       -కోటేశ్వర్‌రెడ్డి,  వ్యవసాయాధికారి, మహేశ్వరం