సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 23:11:21

ప్లాస్మా దాతలు అభినందనీయులు

ప్లాస్మా దాతలు అభినందనీయులు

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్‌ : కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్లాస్మా దాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనాను జయించడంతో పాటుగా కరోనాతో బాధపడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసిన వారు అభినందనీయులన్నారు. కరోనా బాధితులకు తాము నిత్యం అండగా ఉన్నామన్నారు. జయచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నియోజకవర్గం వ్యాప్తంగా 1600 మంది కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్‌, మెడికల్‌ కిట్స్‌ అందజేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా నిత్యం బాధితుల బాగోగులను తెలుసుకోవడంతో పాటుగా వారికి మనోధైర్యం కల్పించామన్నారు. తమ కుటుంబం కూడా కరోనా బారిన పడినా మనోధైర్యంతో జయించామన్నారు. కరోనా జయించిన వారిని చైతన్య పరిచి ప్లాస్మాదానం చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లాస్మాదానం చేసిన రాంబాబు, హనుమాన్‌, భరత్‌, సాయితేజ, శ్రీనివాస్‌, రాంబాబులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అనంతుల రాజారెడ్డి, రఘుమారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మధుసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.