సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 23:31:00

వ్యాయామంతోనే శారీరక దృఢత్వం

వ్యాయామంతోనే శారీరక దృఢత్వం

మంత్రి సబితాఇంద్రారెడ్డి 

చిత్రలేఅవుట్‌ కాలనీలో ఓపెన్‌ జిమ్‌ ప్రారంభం

ఆర్కేపురం:  వ్యాయామంతోనే శారీరక దృఢత్వం కలు గుతుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్‌ చిత్రలేఅవుట్‌ కాలనీలో జీహెచ్‌ఎంసీ ఆధ్యర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   ప్రతి రోజు  కొంత సమయాన్ని జిమ్‌కు, యోగాకు కేటాయించి వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందించుకోవాలన్నారు. రోగాల బారిన పడకుం డా ఉండాలంటే వ్యాయామం ఒక్కటే మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓపెన్‌ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

బాధ్యతగా మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా చిత్రలేఅవుట్‌ కాలనీ పార్కులో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మొక్కల పెంపకంతోనే కాలుష్యాన్ని అ రి కట్టవచ్చని తెలిపారు. హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. 

సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేత

కరోనా నివారణకు నిరంతరం కృషి చేస్తున్న జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని  మంత్రి తెలిపారు. ఆదివారం చిత్రలేఅవుట్‌ కాలనీలో జీహెచ్‌ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నియంత్రణకు జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో సరూర్‌నగర్‌ సర్కిల్‌ డీసీ కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ డివిజన్‌  అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌, చిత్రలేఅవుట్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేశ్‌, కోశాధికారి రాంబాబు, కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, నరేందర్‌, రంగారావు, సుధాకర్‌రెడ్డి, నాయకులు రాజుశ్రీ వాస్తవ, న్యాలకొండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.      

పేదలకు అండగా ప్రభుత్వం

కందుకూరు: ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సరస్వతీగూడకు చెందిన భూసారమోని లింగమయ్య అనారోగ్యానికి గురికావడంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ. 60 వేలు మంజూరయ్యా యి. ఆ చెక్కును పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రాములుతో కలి సి అందజేశారు.  రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ భీంరెడ్డి కృష్ణరాంభూపాల్‌రెడ్డి, లేమూరు ఎంపీటీసీ యా దయ్య, శ్రీనివాస్‌, ముఖేశ్‌ పాల్గొన్నారు.

ఏటీఎం ఏర్పాటు చేయాలి

బడంగ్‌పేట: నాదర్‌గుల్‌లో కోపరేటివ్‌ బ్యాంక్‌ ఏటీఎం ఏర్పాటు చేయాలని భాగ్యనగర్‌ వ్యవపాయ సహకార సంఘం చైర్మన్‌ మర్రి నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.  

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

బడంగ్‌పేట: సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై  టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి సబి తా ఇంద్రారెడ్డి తెలిపారు.  ఆదివారం మీర్‌పేట కార్పొరేషన్‌లోని 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొక్క రాజేందర్‌రెడ్డితో పాటు 200 మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా సీఎం కేసీఆర్‌, మం త్రి కేటీఆర్‌ పని చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నా రు. ఈ కార్యక్రమంలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌  అధ్యక్షురాలు, కార్పొరేటర్‌ సిద్దాల లావణ్య బీరప్ప, నాయకులు అంజిరెడ్డి, రాంరెడ్డి,  యాదగిరి, పాండు, జగదీశ్‌, కృష్ణ, రమేశ్‌రెడ్డి, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.