మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 00:43:57

ముంపు కాలనీలకు శాశ్వతంగా ట్రంక్‌లైన్‌

ముంపు కాలనీలకు శాశ్వతంగా ట్రంక్‌లైన్‌

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

వనస్థలిపురం : నియోజకవర్గంలోని ముంపు కాలనీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ట్రంక్‌ లైన్‌ నిర్మాణం చేపడుతామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం హస్తినాపురం డివిజన్‌ సాగర్‌ ఎన్‌క్లేవ్‌కాలనీ, సాగర్‌రింగ్‌రోడ్‌,  వనస్థలిపురం డివిజన్‌ మల్లికార్జుననగర్‌ ప్రాంతాల్లో కార్పొరేటర్లు రమావత్‌ పద్మనాయక్‌, జిట్టా రాజశేఖర్‌రెడ్డిలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు సుమారు 150కాలనీల్లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రంక్‌లైన్‌ను నిర్మిస్తామని  తెలిపారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. పై కాలనీల నుంచి వచ్చే నీటిని సీవరేజీ ద్వారా అనుసంధానం చేస్తే సమస్య దాదాపు పరిష్కారం అవుతుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు చింతల రవికుమార్‌, సత్యంచారి, శ్రీనివాస్‌యాదవ్‌, మధు, ఈఈ ఆశోక్‌రెడ్డి, డీఈ రాజు, ఏఈ యేము నాయక్‌, కాలనీల ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.