మంగళవారం 27 అక్టోబర్ 2020
Rangareddy - Aug 09, 2020 , 00:22:18

మన ప్రాంతం మరో ఆధ్యాత్మిక కేంద్రం

మన ప్రాంతం మరో ఆధ్యాత్మిక కేంద్రం

తుక్కుగూడ: ఆధ్యాత్మిక రంగంలో కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్‌ పరిధిలోని  సర్ధార్‌నగర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడారు. కార్య నిర్వాహకులు వల్లి, పి.బుచ్చిరెడ్డి, తాళ్ల ప్రభుగౌడ్‌, రెడ్డిగళ్ల రత్నం పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌చైర్మన్‌ భవాని వెంకట్‌రెడ్డి, రెడ్డిగళ్ల సుమన్‌, రవినాయక్‌, బూడిద తేజస్విని, సప్పిడి లావణ్య, మాజీ సర్పంచ్‌ రాకేశ్‌గౌడ్‌, నర్సింహారెడ్డి, పి.సురేశ్‌, ఉప్పునూతల శ్రీనివాస్‌, సామెల్‌ రాజు, పద్మ, శ్రీలత, ఆంజనేయులు, మీడియా సెల్‌ బి.శ్రీధర్‌ పాల్గొన్నారు. logo