మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Rangareddy - Sep 16, 2020 , 01:16:00

పార్కుల అభివృద్ధిపై.. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

పార్కుల అభివృద్ధిపై.. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ఉప్పల్‌ : ప్రభుత్వ స్థలాలను గుర్తించి పార్కులు ఏర్పాటు చేయడం హర్షనీయమని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజల సంక్షేమం, ఆరోగ్యం కోసం కాలుష్యం తగ్గించడానికి పార్కుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉప్పల్‌ భగాయత్‌లోని పార్కును అభివృద్ధి చేశారని, మరో 8 ఎకరాలు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. అదేవిధంగా పార్కులు నిర్మాణం చేయడం, మరిన్ని పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలతో ముందుకు వెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్‌ ప్రాంతంలో కేబీఆర్‌ పార్కు తరహలో పార్కును అభివృద్ధి చేయాలని కోరారు.  నిర్మాణంలో ఉన్నటువంటి థీమ్‌ పార్కులు సత్వరం పూర్తిచేసేవిధంగా చూడాలని కోరారు. ఉప్పల్‌లో శిల్పారామం ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. logo