సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Oct 01, 2020 , 07:02:38

ఏ ఎన్నికలైనా సరే.. సీఎం కేసీఆర్‌ వెంటే ప్రజలు

ఏ ఎన్నికలైనా సరే.. సీఎం కేసీఆర్‌ వెంటే ప్రజలు

ప్రతి కాలనీకి మౌలిక వసతులు

ఇబ్బందులు లేకుండా స్థానికుల కోసం బస్తీ దవాఖానలు

సీసీ రోడ్లు,డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌

బండ్లగూడ, సెప్టెంబర్‌ 30: రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పేర్కొన్నారు.రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అత్తాపూర్‌ డివిజన్‌ పరిధిలోని పాండురంగానగర్‌లో నూతనంగా చేపట్టనున్న అండర్‌గ్రౌండ్‌, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన కార్పొరేటర్‌ రావుల విజయతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్తాపూర్‌ డివిజన్‌ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిరు పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. అర్హూలైన వారందరికీ రెండు పడకల ఇండ్లను అందజేస్తామన్నారు. స్థానికుల కోసం బస్తీ దవాఖానలుఏర్పాటు చేసి ఉచితంగా వారికి వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే రాబోయే జీహెచ్‌ఎంసీ,ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా టీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో గెలువనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌,ఏఈ ప్రశాంత్‌,బాల పోచయ్య, అమరేందర్‌,పాశంమధుసూదన్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, సంజయ్‌, రవీందర్‌,సురేష్‌రెడ్డి,సురేందర్‌రెడ్డి, మహేష్‌,శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

logo