శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 19, 2020 , 00:21:35

వ్యవస్థను మార్చడానికే కొత్త చట్టాలు

వ్యవస్థను మార్చడానికే కొత్త చట్టాలు

ఆ దిశగా ముఖ్యమంత్రి నిర్ణయాలు

దేశంలో ఎక్కడాలేని విధంగా  రాష్ట్రంలో సంస్కరణలు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి : మంత్రి సబితాఇంద్రారెడ్డి

చిత్తశుద్ధితో పనిచేయండి : జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి 

బడంగ్‌పేట, సెప్టెంబర్‌18: అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు సిద్ధాల లావణ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి హాజరైయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గడపను తట్టి పట్టుభద్రుల ఓట్లను నమోదు చేయించాలని మేయర్లు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించడానికి కంకణబద్ధులై పనిచేయాలని అన్నారు. 2017లో పట్టుభద్రులైన ప్రతిఒక్కరి ఓటును నమోదు చేయించాలన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ శాఖలో సమూల మార్పు తీసుకొచ్చారన్నారు. నియోజకవర్గంలో ఫార్మ, ఎలక్ట్రానిక్‌ సిటీ, టాటా వంటి అనేక కంపెనీలు వచ్చాయన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ పట్టుభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వారంలో యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ దుర్గ దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి 

కందుకూరు: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మండల పరిధిలోని గుమ్మడవెల్లికి చెందిన మధుకర్‌కు రూ.60వేలు, కందుకూరుకు చెందిన హేమలతకు రూ.40వేలు, దన్నారానికి చెందిన పద్మకు రూ.25వేలు, మీర్‌ఖాన్‌పేట్‌కు చెందిన జ్యోతికి రూ.22వేల విలువగల చెక్కులను  అందజేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ వరలక్ష్మి, పార్టీ అధ్యక్షుడు, పీఎసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైఎస్‌ చైర్మన్‌ విజేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు వివిధ గ్రామాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

పట్టభద్రులూ మనవైపే

తుక్కుగూడ: పట్టభద్రులంతా తమ వైపే ఉన్నారని, పారదర్శక పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.  శుక్రవారం తుక్కుగూడ మున్సిపల్‌  కేంద్రంలోని కళాశ్రీ గార్డెన్‌లో జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ బి. వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

సహాయనిధితో నిరుపేదలకు ఆసరా

మహేశ్వరం: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు ఆసరా అని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.  కందుకూరులో మహేశ్వరం గ్రామానికి చెందిన జయమ్మకు రూ.57,500 సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కును మంత్రి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, నాయకులు సురసాని సురేందర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ దిద్దెల అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.