సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:27:49

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నెగిటివ్‌

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నెగిటివ్‌

 కుత్బుల్లాపూర్‌/దుండిగల్‌ : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తుగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ గాజులరామారం యూపీహెచ్‌సీలో శనివారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తనతో పాటు తన వ్యక్తిగత డ్రైవర్‌, సిబ్బందికి పరీక్షలు చేయగా కరోనా నెగిటివ్‌ వచ్చింది. అలాగే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌ రాజు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ర్యాపిడ్‌ పద్ధతిలో నిర్వహించిన టెస్ట్‌ల్లో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది.