శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 00:20:53

పనుల్లో వేగం పెంచాలి

పనుల్లో వేగం పెంచాలి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

జల్‌పల్లి చెరువు సుందరీకరణ పనులు పరిశీలన

పహాడీషరీఫ్‌: చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.  మంగళవారం  బాలాపూర్‌లోని జల్‌పల్లి పెద్ద చెరువు పనులను హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు చెరువు సుందరీకరణ నమూనా చిత్రాన్ని చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జల్‌పల్లి పెద్ద చెరువుకు రూ. 8 కోట్లు కేటాయించామన్నారు.  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు వాకింగ్‌ ట్రాక్‌, సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం, రాక్‌గార్డెన్‌, బ్యూటిఫికేషన్‌ తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించారు. అనంతరం జల్‌పల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, అధికారులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలను నాటి నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ఈఈ పద్మ, జల్‌పల్లి మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు  యాదగిరి, షేక్‌ అఫ్జల్‌, లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్‌, మేనేజర్‌ సుదర్శన్‌, ఆర్వో ప్రకాశ్‌, నాయకులు సుధాకర్‌గౌడ్‌, మన్నన్‌, సూపర్‌వైజర్‌  కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్‌:  మొక్కలతోనే మానవ మనుగడ అని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో కౌన్సిలర్‌ చెన్నం అశోక్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికీ ఉచితంగా మొక్కలు అందజేస్తున్నామన్నారు. శేఖర్‌, గణేశ్‌, ప్రవీణ్‌, నరేందర్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

బడంగ్‌పేట: ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని కార్పొరేటర్‌ బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి తెలిపారు. కార్పొరేషన్‌ పరిధిలోని తిరమల్‌నగర్‌లో కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. 

- మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని మిథిలానగర్‌ లక్ష్మీనర్సింహ కాలనీలోని పార్కు స్థలంలో మున్సిపల్‌ సిబ్బంది, కాలనీ వా సులు మొక్కలు నాటుతుండగా కొంతమంది వచ్చి తమ స్థలంలో మొక్కలు ఎలా నాటుతున్నారని ఘర్షణకు దిగారు.  విషయం తెలుసుకున్న బాలాపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందిని అక్కడికి పంపించి ఇరువర్గాలకు నచ్చ చెప్పి సర్వే చేసేంత వరకు మొక్కలు నాటొద్దని  సూచించారు.