శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 05, 2020 , 23:29:03

పల్లెకో ప్రకృతి వనం

పల్లెకో ప్రకృతి వనం

మియావాకి తరహాలో మొక్కల పెంపు

గ్రామానికి ఎకరం స్థలం కేటాయింపు

20 రకాల మొక్కలు నాటేందుకు సిద్ధం

కందుకూరు:  పల్లెల్లో పచ్చదనం కోసం హరితహారంలో భాగంగా చిట్టడవులను పెంచేందుకు ప్రకృతి వనాల ఏర్పాటుకు సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీలో ఎకరం స్థలంలో 20 రకాల మొక్కలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు గ్రామాల్లో వనాల కోసం స్థలాలను పరిశీలిస్తున్నారు.  మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీలకు గాను  కందుకూరు, కొత్తగూడ, మీర్‌ఖాన్‌పేట్‌, గుమ్మడవెల్లి, నేదునూరు, బాచుపల్లి, పులిమామిడి, ముచ్చర్ల, దెబ్బడగూడ, తిమ్మాపూరు, రాచులూరు, మాదాపూరు, గూడూరు 13 పంచాయతీల్లో  స్థలాలను ఎంపిక చేసి భూమిని చదును చేస్తున్నారు.  నిమ్మ, రావి, మర్రి, గాను గ, బాదం, గన్నేరు, తంగేడు, తిప్పతీగ, అల్లనేరేడు, సీతాఫలం, ఈత, రేగు, టేకు, మద్ది, ఉసిరి, తులసి వంటి ఔషధ  మొక్కలతో పాటు పూల మొక్కలను నాటేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మియావాకి తరహాలో చిట్టడవులను తలపించేలా ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దనున్నారు. భూమి చదును పనులు పూర్తి కాగానే ట్రాక్టరుతో దున్ని ఎరువులు వేసి గుంతలు తీసి ప్రతి గ్రామంలో నాలుగు వేల మొక్కలను నాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో మొత్తం లక్షా 40 వేల మొక్కలను నాటుతామని తెలుపుతున్నారు. 

భూమిని చదును చేస్తున్నాం

గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు కోసం భూదాన్‌ బోర్డులోని ఎకరం స్థలాన్ని ఎంపిక చేశాం.  భూమిని చదును చేసి ట్రాక్టరుతో దున్నిస్తు న్నాం. 20 రకాల మొక్కలతో నా లు గు వేల మొక్కలను పెంచేందుకు గుంతలు తీశాం. సేంద్రియ ఎరువులు వేసి మొక్కలు నాటుతాం.

              -సాధ మల్లారెడ్డి, సర్పంచ్‌, కొత్తగూడ

త్వరలో మొక్కలు నాటుతాం

గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు 13 పంచాయతీల్లో స్థలాలు గుర్తించి భూమి చ దును పనులు చేస్తున్నాం. జిల్లా అధికారుల  ఆదేశాల మేరకు 35 గ్రామ పం చాయతీల్లో చిట్టడవులను ఏర్పాటు చేస్తాం. త్వరలో మొక్కలు నాటుతాం.

    -కృష్ణకుమారి, ఎంపీడీవో, కందుకూరు