సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 01:04:13

ముద్విన్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలి

ముద్విన్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలి

ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వినతి

కడ్తాల్‌: కడ్తాల్‌ మండలంలోని ముద్విన్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఆదివారం ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లను కలిసి మండల సాధన సమితి సభ్యులు  వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదయ్య, ఉప సర్పంచ్‌ వినోద్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకట్‌యాదవ్‌, నాయకులు గోపాల్‌, జంగయ్యయాదవ్‌, యాదయ్య, సాయిలు, మల్లేశ్‌, మహేశ్‌, మహేందర్‌, వెంకటయ్య, స్వామి, జంగయ్య, రాజు, శ్రీనివాస్‌, నర్సింహా పాల్గొన్నారు. 

ఆచారి సంఘీభావం... 

ముద్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముద్విన్‌ గ్రామంలో రిలే నిరాహరదీక్షలు చేస్తున్న వారికి ఆదివారం జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి సంఘీభావం తెలిపారు. 

గట్టుఇప్పలపల్లిని మండలంగా చేయాలి

తలకొండపల్లి: గట్టుఇప్పలపల్లిని మండలంగా ప్రకటించాలని గ్రామ జేఏసీ నాయకులు వెంకటయ్య, రేణురెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఎమ్మెల్సీ కసిరెడ్డినారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లతో పాటు అధికారులను కలిసి వినతిపత్రాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వెంకటయ్య, రాజేందర్‌, చెన్నయ్య, దామోదర్‌, రాజ్‌కిరణ్‌, చెన్నయ్య, ఆంజనేయులు, చంద్రశేఖర్‌, శరత్‌చంద్ర, రమేశ్‌, కృష్ణ, కుమార్‌. జంగయ్య, చందు పాల్గొన్నారు.