సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 30, 2020 , 23:20:42

బాలాపూర్‌ గణనాథుడిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

 బాలాపూర్‌ గణనాథుడిని దర్శించుకున్న  ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

 బడంగ్‌పేట, ఆగస్టు30: బాలాపూర్‌ గణనాథుడికి ప్రపంచంలో గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.  ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌, బద్ద మహిపాల్‌రెడ్డి, బోసుపల్లి ప్రతాప్‌, అందెల శ్రీరాములు, తదితరులతో కలిసి ఆయన  బాలాపూర్‌ గణనాథుడిని  దర్శించుకొని పూజలు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌ రెడ్డి వారిని సన్మానించి, లడ్డూను బహుకరించారు.