రైతును రాజు చేయడమే లక్ష్యం

మహేశ్వరం,జనవరి12: నియోజక వర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలపారు. మంగళవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనతరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారని తెలిపారు. మహేశ్వరంలో ఫార్మాకంపె నీ ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తాయన్నారు. మార్కెట్ యార్డుతో కందుకూరు, మహేశ్వరం మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ యార్డుకు స్థలాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం మండలానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలు తీరుస్తామని తెలిపారు. రైతులకు ఇప్పటికే రూ.7,351 కోట్లు ఆందజేశామన్నారు. రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు.
డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని సూచించారు. పండ్ల ఉత్పత్తిలలో ప్రపంచంలో మన దేశానికి ప్రథమస్థానం ఉందని కానీ మనం పండించే పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో కేవలం 2 శాతం మాత్రమే వాటా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించాలంటే సాగు నిల్వల విషయంలో అనేక మెలకువలు తెలుసుకోవాలన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆధునిక పంటల సాగుపై రైతువేదికల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నామన్నా రు.శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 500 ఎకరాల్లో అత్యాధునిక పంటల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎనిమిది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఎంఎస్పీ విషయంలో బాధ్యతల నుంచి తప్పుకునేందుకే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కొత్త వ్యవసాయ చట్టాలమీద స్టే విధించడం శుభపరిణామం అన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ జాంగీర్పాషా, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు కాసుల సురేశ్, ప్రియాంకరాజేశ్, ఎంపీటీసీ సుదర్శన్‌యాదవ్, సాలీవీరానాయక్, మెగావత్రాజునాయక్,శివిరాజునాయక్ కోఆప్షన్‌సభ్యులు ఆదిల్‌అలీ,మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ సమీర్, ఉపసర్పంచ్ దోమశ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రయ్యముదిరాజ్,కూనయాదయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు