బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 01:00:25

ఎట్టయ్యకు మంత్రి నివాళి

 ఎట్టయ్యకు మంత్రి  నివాళి

  బడంగ్‌పేట, ఆగస్టు17:  మీర్‌పేట కార్పొరేషన్‌పరిధిలోని  11 వ డివిజన్‌ కార్పొరేటర్‌ ధనలక్ష్మి రాజ్‌కుమార్‌ మామ దోమలపల్లి ఎట్టయ్య దశదిన కార్యక్రమానికి సోమవారం మంత్రి  సబితా ఇంద్రారెడ్డి హాజరై నివాళులర్పించారు. కార్పొరేటర్‌ ధనలక్ష్మి రాజ్‌కుమార్‌, నవీన్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా ఎట్టయ్య వాటర్‌ వర్క్స్‌ డిపార్టు మెంట్‌లో పనిచేసే వారు. ఇబ్రహింపట్నం ఎంపీపీ  కృపేశ్‌, మీర్‌పేట డిప్యూటీ మేయర్‌ విక్రంరెడ్డి, బడంగ్‌పేట డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, నాయకుడు దీప్‌లాల్‌ చౌహాన్‌, కార్పొరేటర్లు  సూర్ణ గంటి అర్జున్‌, ముత్యాల లలిత కృష్ణ, ముద్ద పవన్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.