బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 30, 2020 , 07:07:23

సమస్యాత్మక ముంపు ప్రదేశాల్లో పర్యటించిన మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి

సమస్యాత్మక ముంపు ప్రదేశాల్లో పర్యటించిన మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి

ట్రంక్‌లైన్‌ను పొడిగించాలని అధికారులకు ఆదేశం

బడంగ్‌పేట, సెప్టెంబర్‌ 29: ముంపు ప్రాంతాల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. మీర్‌పేట పెద్ద చెరువు నిండుకుండలా మారి ఎగువ కాలనీలు ముంపునకు గురయ్యాయి. దీంతో చెరువును మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువు నుంచి ట్రంకులైన్‌ ద్వారా నీటిని బయటికి పంపడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆయా వార్డుల కార్పొరేటర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తయారీ చేసిన మ్యాప్‌ను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ట్రంక్‌లైన్‌ను పొడిగించాలన్నారు. వరద ముంపు నుంచి ప్రజల ను కాపాడాలన్నారు. అవసరమైతే ట్రంచ్‌కొట్టి వరదనీరు దిగువకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదనీటిలో ఉన్న కాలనీవాసులకు సాయమందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమం లో బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిఫ్యూటీ మేయర్‌ ఇబ్రహీం శేఖర్‌, మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌, డిఫ్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, మీర్‌పేట కమిషనర్‌ సుమన్‌రావు కార్పొరేటర్లు, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
logo