ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 07, 2020 , 01:47:08

ఆన్‌లైన్‌ క్లాసులపై మంత్రి ఆరా

ఆన్‌లైన్‌ క్లాసులపై మంత్రి ఆరా

తిమ్మాపూర్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి సబితారెడ్డి

యూ ట్యూబ్‌లోనూ పాఠాలు అందుబాటాలో ఉన్నాయని వివరించిన మంత్రి

  కందుకూరు : లాక్‌ డౌన్‌ కారణంగా పాఠశాలలు తెరుచుకోక పోవటంతో ప్రభుత్వం సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించిన డిజిటల్‌ తరగతులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న పాఠాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్‌కే పురం డివిజన్‌, కందుకూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో పలువురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో ఏ తరగతి చదువుతున్నారు,పాఠాలు అర్థం అవుతున్నాయా..? అని అడుగగా వారు బాగానే అర్థం అవుతున్నాయని జవాబు ఇచ్చారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే యూ ట్యూబ్‌లో పాఠాలు అందుబాటులో ఉంటాయని, అవసరమైతే మళ్లీ చూడాలన్నారు.ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఒక్కొక్కరుగా వెళ్లి ఉపాధ్యాయులతో పాఠశాలకు వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు.బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని,కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు.అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి మాట్లాడారు. నెల రోజుల క్యాలెండర్‌తో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభయ్యాయయని, డిజిటల్‌ చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మూడు భాషల్లో వర్క్‌ షీట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీటిని ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. మంత్రి వెంట జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వట్నాల ఈశ్వర్‌గౌడ్‌, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పున్న భిక్షపతి, సర్పంచ్‌ గంగాపురం గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.