గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 15, 2020 , 00:31:15

శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు

శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు

మన్సూరాబాద్‌ :   ఆటోనగర్‌లోని శ్మశానవాటికలో నిర్మిస్తున్న అపరకర్మల భవనాన్ని సోమవారం  కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ   భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అంత్యక్రియల సందర్భంగా శ్మశానవాటికకు వచ్చే ప్రజలకు కూర్చునేందుకు బెంచీలు, స్నానాల గదులు తదితర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  పలు శ్మశానవాటికల్లో మృతదేహాలను కాల్చేందుకు ఎలక్ట్రికల్‌ బర్నింగ్‌ యూనిట్లను నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, ఈఈ రాజయ్య, డిప్యూటీ కమిషనర్‌ మారుతీ దివాకర్‌, ఏఎంహెచ్‌ఓ మంజులవాణి పాల్గొన్నారు.