ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 23:46:09

మోడల్‌గా మార్కెట్లు

 మోడల్‌గా మార్కెట్లు

 అభివృద్ది బాటలో ఎన్టీఆర్‌నగర్‌ మార్కెట్‌ 

 రూ.1.20 సీసీ రోడ్లు ఏర్పాటు 

 హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

  ఆర్కేపురం, ఆగస్టు 11 : కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధికి నోచుకోని మార్కెట్లు తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. రైతులకు, రిటైల్‌ వ్యాపారులకు, వినియోగదారులకు మెరుగైన సేవలందించే దిశగా ఆర్కేపురంలోని ఎన్టీఆర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. భద్రత కోసం మార్కెట్‌లో రూ.20లక్షలతో 50 సీసీ కెమెరాలు, రూ 5 లక్షలతో ఇన్నర్‌లైటింగ్‌, ఎల్‌ఈడీ లైట్లు, రూ. కోటి ఇరువై లక్షలతో సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. పారిశుధ్యం లోపించకుండా చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం మరుగు దొడ్లను నిర్మించారు.   మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో  రూ.10లక్షల వ్యయంతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. గతంలో రూ.7లక్షలు ఉన్న మార్కెట్‌ ఆదాయాన్ని నేడు రూ.10 లక్షలకు పెంచారు.  మార్కెట్లను మోడల్‌ రైతుబజార్లుగా తీర్చిదిద్దుతున్నారు.  సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో రైతులు, వినియోగదారులు, రిటైల్‌ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఆదాయం పెంచేందుకు కృషి  

 మార్కెట్‌కు వచ్చే రైతులకు, వినియోగదారులకు  ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. రైతులు పండించిన పంటను నేరుగా అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.  నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఆకు కూరలు, కూరగాయలు ఈ మార్కెట్‌కు వస్తున్నాయి. మార్కెట్‌ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం.                                                                                      

-చిలుక నర్సింహారెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి