గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:22:43

ముంపు ప్రజలను ఆదుకుంటాం

ముంపు ప్రజలను ఆదుకుంటాం

 మంత్రి  సబితా ఇంద్రారెడ్డి 

  బడంగ్‌పేట :  ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌, లెనిన్‌ నగర్‌, చిం తల కుంట, మురళీ కృష్ణానగర్‌, తాళ్ల చెరువు, మంత్రాల చెరువులు, బడంగ్‌పేట్‌లోని అన్నపూర్ణనగర్‌ షిరిడీ ఇన్‌క్లేవ్‌, బుడాన్‌కాన్‌ చెరువులోని ముంపు ప్రాంతాలను మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కమిషనర్‌ సుమన్‌ రావుతో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముంపు ప్రజల కోసం శ్రీ శక్తి భవనం, జనప్రియలోని కమ్యూనిటీ హాల్‌, పాఠశాలలో శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వరదలో చిక్కుకున్న ప్రజలకు వాహనాలను ఏర్పాటు చేసి శిబిరాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ముంపు సమస్య పోయే వరకు ప్రజలకు నిత్యావసర సరుకులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయిస్తామన్నారు. బాలాపూర్‌ చౌరస్తా నుంచి ట్రంక్‌లైన్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్పొరేటర్లు గజ్జల రాంచందర్‌, శ్రావణ్‌ కుమార్‌, రవి నాయక్‌, అంజయ్య, అక్కి మాధవి ఈశ్వర్‌ గౌడ్‌, అనిల్‌ కుమార్‌, నాయకులు  ప్రభాకర్‌రెడ్డి, సంరెడ్డి వెంకట్‌రెడ్డి, జోజి, కృష్ణ, నర్సింహ,  వీరారెడ్డి, శ్రీను నాయక్‌ పాల్గొన్నారు. 

 మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి..

 తుక్కుగూడ :  మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం మున్సిపల్‌ పరిధిలోని రావిరాల సమీపంలో డంపింగ్‌ యార్డు పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌,  కౌన్సిలర్లు బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌ గౌడ్‌, సప్పిడి లావణ్య రాజు,  రెడ్డిగళ్ల సుమన్‌, రవినాయక్‌, మాజీ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, శ్రీధర్‌ గౌడ్‌,  పెంటమల్ల సురేశ్‌, రాకేశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.  

 సహాయక చర్యలు చేపడుతున్నాం.. 

కార్పొరేషన్‌ పరిధిలోని బాలాపూర్‌ పెద్ద చెరువు, అల్మాస్‌గూడ కోమటి కుంట, పోచమ్మ కుంట, ఎర్ర కుంట, అంతమోని కుంటలు నిండి మత్తడి దుంకడంతో మేయర్‌ చిగిరింత పారిజాత, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ కృష్ణ మోహన్‌రెడ్డి శనివారం సందర్శించారు. అనంతరం ఫ్రైడ్‌, నక్షత్ర, రాఘవేంద్ర కాలనీ, సాయి బాలాజీ, సాయి ప్రభు హోమ్స్‌, శాంతి నగర్‌, లక్ష్మీనగర్‌, మధురా పురి, సీఎంఆర్‌, బోయపల్లి ఇన్‌క్లేవ్‌ తదితర కాలనీల్లో వారు పర్యటించారు. డీఈ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్‌ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, ఎర్ర మహేశ్వరీజైయింద్‌, మనోహర్‌, పెద్ద బావి సుదర్శన్‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

నిండిన చెరువులు, కుంటలు.. 

 కందుకూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి.  మండలంలోని కొత్తగూడ, కందుకూరు, జై త్వారం, పులిమామిడి, బాచుపల్లి, నేదునూరు, దన్నారం, చిప్పలపల్లి, దెబ్బడగూడ, రాచులూరు, తదితర గ్రామా ల్లో చెరువులు నిండాయి.  

 ముంపు సమస్యకు పరిష్కారం.. 

 పహాడీషరీఫ్‌:  ముంపు సమస్యను పరిష్కరిస్తున్నట్లు జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జి. పి కుమార్‌, కౌన్సిలర్‌ బుడుమాల యాదగిరి అన్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాలకు మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లి, వీకర్‌సెక్షన్‌కాలనీ, గ్రీన్‌సిటీ, కొత్తపేట, వాదియే ముస్తఫా, వాది హుదా, ఉస్మాన్‌నగర్‌, షాహీన్‌నగర్‌ ప్రాంతాల్లో  వరదనీరు చేరింది. మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్లా సాది, కమిషనర్‌, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మోయిన్‌బాబా, సూపర్‌వైజర్లు హరినాథ్‌గౌడ్‌, కుమార్‌, అంజయ్య, మాన్‌సూన్‌ సిబ్బంది ముంపు సమస్యను పరిష్కరిస్తున్నారు. 

ఆలుగు పారిన చెరువులు.. 

 మహేశ్వరం :   మండలంలోని గంగారం, సుభాన్‌పూర్‌, కొత్వాల్‌చెరువు, అమీర్‌పేట్‌, కల్వకోల్‌, కోళ్లపడకల్‌లో  వర్షాలకు చెరువులు నిండుకుండలుగా మారాయి.  వర్షాలు భారీగా  కురవడంతో పంట పొలాలకు బలం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

నీట మునిగిన ఇండ్లు..

 శంషాబాద్‌ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  కె.బి దొడ్డిలో ఇండ్లు నీట మునగి ఓ ఇళ్లు కూలిపోయింది. శనివారం కామునిచెరువు, ఎంటేరు, ఈసీవాగులు,  వరదతో పోటెత్తాయి.  పెద్దతూప్ర వెంకటసముద్రం చెరువు గండిని ఎంపీపీ దిద్యాల జయమ్మ  అధికారులతో కలిసి పరిశీలించారు. కె.బి దొడ్డిలో ముంపు ప్రాంతాలను జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్‌, శంషాబాద్‌ పరిధిలో కాముని చెరువును మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ పరిశీలించారు.