బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 00:43:51

నవీన్‌కుమార్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం

నవీన్‌కుమార్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం

రూ.6లక్షలు సాయం, డబుల్‌ బెడ్‌ ఇల్లు అందజేస్తాం

వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తాం

బాధితుడి కుంటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి 

తక్షణ సాయంకింద రూ.50వేలు అందజేత

బడంగ్‌పేట : వరద నీటిలో కొట్టుకు పోయి మృతి చెందిన నవీన్‌కుమార్‌ కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.6లక్షలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌లో ఇల్లు ఇస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సోమవారం ఆమె మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి ప్రశాంత్‌ హిల్స్‌కాలనీలోని బాధితుడి నివాసానికి చేరుకొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అతడి తల్లి లలిత, భార్య శాలినీ, కూతుళ్లు హర్షిత, తేజస్వినిలను ఓదార్చారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందజేశారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారన్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేషన్‌లో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి విద్యను అందిస్తామని తెలిపారు. పరామర్శించిన వారిలో బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి,  మీర్‌పేట డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్‌ ధనలక్ష్మి రాజ్‌కుమార్‌, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు గజ్జల రాంచందర్‌, ముద్ద పవన్‌కుమార్‌, ఏనుగు రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు బోయపల్లి శేఖర్‌రెడ్డి, సంరెడ్డి వెంకట్‌రెడ్డి, జంగారెడ్డి తదితరులు ఉన్నారు. 
logo