శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 19, 2020 , 00:25:58

నియోజకవర్గాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాం

నియోజకవర్గాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాం

   దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

  ఎల్బీనగర్‌ : నియోజకవర్గాన్ని సుందరమైన పార్కులతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చంపాపేట డివిజన్‌లోని మారుతీనగర్‌లో నూతనంగా నిర్మించిన పార్కును కార్పొరేటర్‌ సామ రమణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం ప్రధాన రహదారులతో పాటుగా పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తూ రూపురేఖలు మార్చుతున్నామన్నారు. కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి మాట్లాడుతూ.. డివిజన్‌లోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. ఈ కార్యక్రమంలో మారుతీ నగర్‌ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, సుదర్శన్‌, రమేశ్‌కుమార్‌, రాజేంద్ర, సుఖ్‌జీవన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, మల్లారెడ్డి, జనార్దన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సామ కృష్ణారెడ్డి, చీర శ్రీనివాస్‌, రఘవాచారి, నల్ల రఘుమారెడ్డి, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.