మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 00:57:24

శేరిలింగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

శేరిలింగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

 శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో రూ.1 కోటి అంచనా వ్యయంతో చేపట్టిన యూజీడీ నిర్మాణ పనులను, శ్రీరాంనగర్‌ బీ బ్లాక్‌లో రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సమస్యలు కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట డీఈ శ్రీనివాస్‌, ఏఈ సునీల్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి, మియాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పొడుగు రాంబాబు, వేణు, రమేశ్‌ తదితరులు ఉన్నారు. 

నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైదర్‌నగర్‌ డివిజన్‌లో రూ.1,60,95, 000 ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ తెలిపారు.  

పేదల కుటుంబాల్లో ‘కల్యాణలక్ష్మి’ వెలుగులు 

మియాపూర్‌ : ఆల్విన్‌ కాలనీ పరిధిలోని షంషీగూడ మహ్మద్‌  ఫైజాదికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద మంజూరైన రూ. 1,00,116 చెక్కును సోమవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో విప్‌ గాంధీ అందజేశారు.

నాలా పూడికతీత పనుల్లో జాప్యం వద్దు

 కొండాపూర్‌ : నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను త్వరితగతిన పూర్తి చేసి ముంపు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని మార్తాండనగర్‌, ప్రేమ్‌నగర్‌ కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించి ఓపెన్‌ నాలా పూడికతీత పనులను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ డీఈ రమేశ్‌, ఏఈ శ్రీనివాస్‌, మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, కాలనీ వాసులు శ్రీనివాస్‌ చౌదరీ, గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు.