శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 27, 2020 , 00:01:28

నగరంలో మళ్లీ చిరుత?

నగరంలో మళ్లీ చిరుత?

రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వాలంతరి కార్యాలయం వెనుక ఉన్న అహ్మద్‌ (చిచ్చ) అనే రైతు పశువుల కొట్టంలో బుధవారం ఉదయం ఒక లేగ దూడను చిరుత చంపి తిన్నట్లు స్థానికులు తెలుపడంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేగ దూడను చంపింది చిరుతనేనా.. అని తెలుసుకునేందుకు అక్కడ కెమెరాలను ఏర్పాటు చేశారు. అది చిరుత అయి ఉంటే తప్పనిసరిగా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. మొత్తం మీద లేగ దూడను చంపింది చిరుతనా..? కాదా..? అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు.   -బండ్లగూడ