మంగళవారం 27 అక్టోబర్ 2020
Rangareddy - Sep 26, 2020 , 00:55:38

15 ఏండ్ల సమస్యకు దారిచూపండి

15 ఏండ్ల సమస్యకు దారిచూపండి

 ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

హయత్‌నగర్‌ : ఆటోనగర్‌లో ఇసుక లారీల అడ్డా తరలింపునకు రంగం సిద్ధమైనట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. 15 ఏండ్లు సమస్యగా ఉన్న ఆటోనగర్‌ ఇసుక లారీల అడ్డాను తరలించాలని ఎమ్మెల్యే శుక్రవారం టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2006లో హుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద సుమారు 10ఎకరాల స్థలాన్ని ట్రక్‌ పార్కింగ్‌ కోసం కేటాయించిన్నట్లు తెలిపారు. సదరు స్థలంలో ట్రక్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు అధికారుల చర్యలు తీసుకోకపోవడంతో ఆటోనగర్‌ ఇసుక లారీల అడ్డా సమస్యగా మారిందన్నారు. కాగా ఈ విషయంలో టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి త్వరలోనే ఓఆర్‌ఆర్‌ ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించి ఇసుక లారీల అడ్డా తరలింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. 

logo