సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 01:04:40

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

కొందుర్గు మండలం చెర్కుపల్లిలో కంపోస్టు యార్డు ప్రారంభం

కొందుర్గు: గ్రామాల అభివృద్ధికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కంపోస్టుయార్డును ఆయన ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు మార్చేందుకు అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామాలను పట్టణాలను దీటుగా తీర్చిదిద్దేందుకు అనేక నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ, ఇంకుడుగుంతల ఏర్పాటు, శ్మశానవాటికలు, కంపోస్టుయార్డులను ఏర్పాటు చేసి గ్రామాలను సుందరంగా మారుస్తున్నట్లు తెలిపారు. మొక్కల పెంపకాన్ని నిర్వహించి గ్రామం మొత్తం పచ్చదనంతో నిండిపోయేలా చూస్తున్నట్లు వివరించారు. 

 మృతుడి కుటుంబానికి పరామర్శ... 

కొందుర్గు మండలంలోని విశ్వనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన జహంగీర్‌ శనివారం వాగులో పడి కొట్టుకుపోయి మృతి చెందాడు. ఆదివారం మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రభుత్వం  అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, ఎంపీవో లాలయ్య, వైస్‌ ఎంపీపీ రాజేశ్‌పటేల్‌, చెర్కుపల్లి సర్పంచ్‌ కృష్ణవేణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, ఎదిర రామకృష్ణ, సుందర్‌, పాపయ్య, యాదిరెడ్డి, సందీప్‌, శ్రీను, విజయ్‌, యాదగిరి, పాల్గొన్నారు.


logo