శనివారం 31 అక్టోబర్ 2020
Rangareddy - Sep 26, 2020 , 00:55:29

సమస్యలు తెలుసుకొని పనిచేయాలి

సమస్యలు తెలుసుకొని పనిచేయాలి

కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి   

ఉప్పల్‌, సెప్టెంబర్‌ 25 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సమష్టిగా పని చేయాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షుడు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయా డివిజన్లలోని సమస్యలు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గాలు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు బేతి స్వప్నారెడ్డి, గొల్లూరి అంజయ్య, శాంతిసాయిజెన్‌ శేఖర్‌, పావనిమణిపాల్‌రెడ్డి, స్వర్ణరాజ్‌, మేకల అనలాహన్మంతరెడ్డి, దేవేందర్‌రెడ్డి, గంధం జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, గోపు సరస్వతి సదానంద్‌, డివిజన్‌ అధ్యక్షుడు, నేతలు వేముల సంతోష్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, బాలరాజు, మేడల మల్లికార్జున్‌గౌడ్‌, సర్వబాబు యాదవ్‌, నాగిళ్ల బాల్‌రెడ్డి, వనంపల్లి గోపాల్‌రెడ్డి, గిరిబాబు, భాస్కర్‌ ముదిరాజ్‌, లేతాకుల రఘపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.