సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Jul 19, 2020 , 00:34:18

కరోనాలోనూ ‘కల్యాణలక్ష్మి’

కరోనాలోనూ ‘కల్యాణలక్ష్మి’

వైరస్‌ ప్రబలుతున్నా ఇంటికెళ్లి చెక్కులందిస్తున్నఅధికారులు

బాలాపూర్‌ మండలంలో 747 మందికి పంపిణీ

బడంగ్‌పేట:  కరోనా నేపథ్యంలో కూడా సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. దానిలో భా గంగా పెండ్లి  చేసుకున్న ఆడబిడ్డలకు ప్రభుత్వం కల్యా ణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేస్తోంది.  బా లాపూర్‌లో 747 మంది లబ్ధిదారులకు రూ. 7.48 కోట్ల చెక్కులను అందజేశామని తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  ఇంటికెళ్లి చెక్కులను అందజేయాలని మంత్రి సబి తా ఇంద్రారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. క రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మూడు నెలలుగా  లబ్ధిదారుల ఇంటికే వెళ్లి చెక్కులను అందజేస్తున్నామని తెలుపుతున్నారు.  మేలో 281 షాదీముబారక్‌, 62 క ల్యాణ లక్ష్మి మొత్తం 343 , జూన్‌లో 44 షాదీముబారక్‌, 64 క ల్యాణ లక్ష్మి  మొత్తం  108, జూలైలో  2 81 షాదీముబారక్‌, 15 కల్యాణ లక్ష్మి మొత్తం 296 చెక్కులను  లబ్ధిదారులకు అందజేశామని అధికారులు చెప్పారు. కష్టకా లం లో చెక్కులు ఆసరాగా నిలుస్తున్నాయని  లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

15 మందికి చెక్కులు అందజేత

పహాడీషరీఫ్‌: షాదీముబారక్‌ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని జల్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్లాసాది తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్‌నగర్‌, ఎర్రకుంట, బిస్మిల్లా కాలనీ, వాదియే సాలహీన్‌ తదితర కాలనీల్లో అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి  15 మంది లబ్ధిదారులకు శనివారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ఆడపిల్లలకు అండగా ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో వీఆర్వోలు శేఖర్‌, మన్నన్‌, ఎంఐఎం నాయకులు అహ్మద్‌ అజీజ్‌, హసన్‌, షేక్‌ ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు అందజేస్తున్న వీఆర్వోలు 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు వీఆర్వోలు  లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందజేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా సి బ్బంది బాగా పనిచేస్తున్నారు. కల్యాణ లక్ష్మి , షాదీముబారక్‌ పథకాలు పేద లకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. 

-శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌, బాలాపూర్‌

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

కరోనా కాలంలో ఆడపిల్లల పెం డ్లిళ్లు చేసి ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వం చెక్కులను అందజేసింది. ఈ డబ్బులు పేద లకు ఎంతో ఉపయోగ పడుతాయి.  చేసిన అప్పులు తీర్చుకుంటాం. సంతోషంగా ఉంది.  సీఎం కేసీఆర్‌కు, మంత్రి సబితా 

ఇంద్రారెడ్డికి రుణపడి ఉంటాం.  

                       -ఫాతిమా, లబ్ధిదారురాలు