గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 27, 2020 , 00:21:31

కరోనా బాధితులకు 150 పడకలతో ఐసొలేషన్‌ కేంద్రం

కరోనా బాధితులకు 150 పడకలతో ఐసొలేషన్‌ కేంద్రం

ఎల్బీనగర్‌ జంట సర్కిళ్ల పరిధిలో ఏర్పాటు 

ఇండ్లలో ఐసొలేషన్‌ సౌకర్యం లేని వారికి కోసమే.. 

ఒక్కో సర్కిల్‌కు 50మందికి అవకాశం 

ఉచితంగా కేటాయింపు, సకల సౌకర్యాలు

ఎల్బీనగర్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు తమ నివాసాల్లో ప్రత్యేకంగా ఐసొలేషన్‌ సౌకర్యం లేనివారికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు ప్రభుత్వం కల్పించిన ఐసొలేషన్‌ సదుపాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. ఒక్కో సర్కిల్‌కు 50 మందికి సరిపడే పడకలు అందుబాటులో ఉన్నాయి. అన్ని సదుపాయాలు, సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఐసొలేషన్‌ కేంద్రంలో ఉండేందుకు ఉచితంగా అవకాశం లభిస్తోంది. కొత్తపేట కృష్ణవేణినగర్‌లో ఈ ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు అంతస్తుల ఈ భవనంలో 150 పడుకలను ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని కరోనా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రూపిరెడ్డి ఉపేందర్‌రెడ్డి కోరారు.  

కరోనా ఐసొలేషన్‌ సౌకర్యం కోసం..

 హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు వారి ఇంట్లో ఐసొలేషన్‌ సౌకర్యం లేకుంటే ప్రభుత్వ ఐసొలేషన్‌ కోసం ఆయా సర్కిళ్ల ఉప కమిషనర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. హయత్‌నగర్‌ సర్కిల్‌ వారు డీసీ మారుతీదివాకర్‌ 8919563100, ఎల్బీనగర్‌ సర్కిల్‌ డీసీ విజయకృష్ణ 040-237077, సరూర్‌నగర్‌ సర్కిల్‌ డీసీ హరికృష్ణయ్య 7337557245ను సంప్రదించాలని తెలిపారు.