బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 27, 2020 , 23:23:09

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

బడంగ్‌పేట:  సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్పొరేషన్‌లోని 25వ వార్డు కార్పొరేటర్‌ రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, నాదర్‌గుల్‌కు చెందిన మాజీ ఉపసర్పంచ్‌ మర్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేసి టీఆర్‌ఎస్‌ను తిరుగు లేని శక్తిగా మా ర్చాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి   తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్‌, పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, నాయకులు రామిడి రాంరెడ్డి, బమిడి జంగారెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ , బల్వంత్‌, పుట్టగల్ల సంతోష్‌, కృష్ణారెడ్డి, అమృత నాయుడు, సాంబ శివ, మాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.