శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 23:52:41

లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి

 ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

మాదాపూర్‌, ఆగస్టు 24: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్‌ డివిజన్‌ పరిధిలోని రాజేందర్‌రెడ్డి నగర్‌ కాలనీలో లోతట్టు ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవడంతో ఆయా ప్రాంతాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈఈ చిన్నారెడ్డి, ఏఈ అనురాగ్‌, చందానగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాఘనాథ్‌రెడ్డి, మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, మాదాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, రాజేందర్‌రెడ్డి నగర్‌ కాలనీ అధ్యక్షుడు బాలాజీ, కాలనీ వాసులు రఘుపతిరెడ్డి, వెంకటేశ్వరరావు, జగ్గారెడ్డి, లింగారెడ్డి, మాదవ్‌, వెంకటేశ్‌, విజయకృష్ణ, కిషోర్‌, శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.