బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 23:53:50

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మాదాపూర్‌ : కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గురువారం ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్‌, మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, కుమార్‌ పాల్గొన్నారు.