ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 00:49:39

నార్సింగిలో పరిశుభ్రత యంత్రాల ప్రారంభోత్సవం

నార్సింగిలో పరిశుభ్రత యంత్రాల ప్రారంభోత్సవం

మణికొండ:ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ సాధారణ నిధులతో కొనుగోలు చేసిన రెండు తడి, పొడి చెత్త సేకరణ వాహనాలు, డ్రైనేజీ క్లీనింగ్‌ యంత్రాన్ని మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో బుధవారం మున్సిపల్‌ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు మాన్‌సూన్‌ ప్రత్యేక బృందాలను రప్పించి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు, మురుగు కాల్వల పరిశుభ్రతపై పారిశుధ్య బృందం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌యాదవ్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.