పెద్దఅంబర్‌పేట : పెద్దఅంబర్‌పేట మున్సిపాల్టీలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఖమార్ అహ్మద్ అన్నారు. హతిగూడ సర్వే నంబర్ 2,3,4,5లలోని ప్లాట్ నంబర్ 132లోని 200గజాల స్థలంలో ఎడునూరి జ్యోతి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టింది. సదరు అక్రమ నిర్మాణాన్ని అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. అదే విధంగా కుంట్లూర్-పసుమాముల రోడ్డులో సర్వే నంబర్ 83లో అనధికారికంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల సెంటింగ్ను తొలగించామని స్పష్టం చేశారు.