బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 05, 2020 , 00:42:22

పుదీనాతో అధిక లాభాలు

 పుదీనాతో అధిక లాభాలు

మోహబ్బత్‌నగర్‌లో జోరుగా సాగు చేస్తున్న అన్నదాతలు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్న రైతన్న

మహేశ్వరం: పుదీనాను మోహబ్బత్‌నగర్‌లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు.  గ్రామంలో రెండు వందల వరకు  కుటుంబాలు ఉండగా  వందకు పైగా పుదీనా సాగుపైనే ఆ ధారపడి  జీవిస్తున్నారు. దాదాపుగా 50 ఎకరాల్లో  సాగుచేస్తున్నారు. ఎకరానికి రూ. 50 నుంచి 60 వేల వరకు ఖర్చవుతుందని రైతులు తెలుపుతున్నారు. ఏడాదికి రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు లాభం వస్తుందని పేర్కొంటున్నారు. ఒక్కసారి పుదీనా వేస్తే ఐదారేండ్లుగా కొనసాగుతుందని వివరిస్తున్నారు. ప్రతి రోజు నీరుపెట్టి కలుపు తీసి, ఎర్రమట్టి, పశువుల పేడ వేసి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజులకోసారి కోసుకోవచ్చని చెబుతున్నారు. పుదీనాను కట్టలుగా కట్టి హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్‌, మాదన్నపేట, కొత్తపేట మార్కెట్‌కు తరలించి ఒక కట్టను రూ.5 వరకు విక్రయిస్తున్నట్లు  అన్నదాతలు తెలుపుతున్నారు. దీంతో అధిక లాభాలు వస్తున్నాయని వివరిస్తున్నారు.

అర ఎకరంలో సాగు చేస్తున్న

మా గ్రామంలో ఎక్కువగా పుదీనానే వే స్తుంటాం. దీని పైన్నే ఆధారపడి బతు కుతున్నాం. అర ఎకరంలో సాగు చేస్తు న్నా. రూ. 50 వేలు పెట్టుబడి పెట్టగా ఏ డాదిలోగా రూ. లక్ష వరకు ఆదాయం వస్తుంది. అధిక లాభాలు వస్తున్నాయి.

                                          -దేవేందర్‌,రైతు 

గుడిమల్కాపూర్‌లో విక్రయిస్తున్నాం

కొన్నేండ్లుగా సాగు చేస్తున్నా. పుదీనా ను గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నా. పండుగలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. సేం ద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నా. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నా.                                       

                                   -అంజయ్య,రైతు