శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 12, 2020 , 23:57:49

హెచ్‌సీయూలో హెర్బల్‌ గార్డెన్‌..

 హెచ్‌సీయూలో హెర్బల్‌ గార్డెన్‌..

 కొండాపూర్‌ : గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో వివిధ ఔషధ గుణాలు కలిగిన మొక్కల జాతులతో నూతనంగా ఏర్పాటు చేసిన హెర్బల్‌ గార్డెన్‌ను బుధవారం వర్సిటీ వీసీ పొదిలి అప్పారావు ప్రారంభించారు. అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన సుమారు 250 మొక్కలతో హెర్బల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం హెర్బల్‌ గార్డెన్‌లో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. దయానంద, యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ అత్తిపట్టి ఆర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ డీ శారద, సీపీ శర్మ, డాక్టర్‌ ఏఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.