సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Sep 20, 2020 , 01:41:31

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

     ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

 బండ్లగూడ, సెప్టెంబర్‌ 19: రాష్ట్రంలో ప్రజలందరూ అరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. రాజేం ద్రనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు సయ్యద్‌ ముజమిల్‌ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను స్థానిక కార్పొరేటర్‌ కోరని శ్రీలతతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేంకు కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెడుతు న్నారని తెలిపారు. బస్తీ దవాఖానల ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి ధర్మారెడ్డి, పలుగు చెరువు మహేశ్‌, శ్రవణ్‌, మాలిక్‌, యాకుబ్‌, ఎండీ అశ్వక్‌, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం.. 

 శంషాబాద్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెజార్టీ విజయానికి కంకణబద్ధులు కావాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం శనివారం శంషాబాద్‌లోని బేగం ఫంక్షన్‌హాలులో జరిగిన మున్సిపల్‌, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దూడల వెంకటేశ్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.  ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్వి, వైస్‌ ఎంపీపీ నీలం మోహన్‌, శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు, దిద్యాల శ్రీనివాస్‌, కోఆప్షన్‌ కవితాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత..  శంషాబాద్‌ మండలం చిన్నగోల్కొండకు చెందిన టి.బాల్‌రెడ్డికి శనివారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేశారు.  
 


logo