శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 14, 2020 , 00:41:22

ఆకుట్టుకుంటున్న ప్రకృతి వనాలు

ఆకుట్టుకుంటున్న ప్రకృతి వనాలు

పూలు, పండ్ల మొక్కల ఏర్పాటు 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

 మహేశ్వరం:  గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో ఎకరా స్థలంలో వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులతో  పనులను చేస్తున్నారు. పార్కుల్లో రకరకాల మొక్కలను పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నర్సరీల నుంచి పండ్ల, ఔషధ , నీడనిచ్చే వేప, రావి, మర్రి మొక్కలను తీసుకొచ్చి నాటుతున్నారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  వాకింగ్‌ ట్రాక్‌లు, బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. మహేశ్వరంలో 31 గ్రామ పంచాయతీల్లో 15 ప్రకృతి వనాల పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ వనాలతో గ్రామాల్లో రూపురేఖలు మారనున్నాయి. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

15 గ్రామాల్లో పనులు పూర్తి 

 31 గ్రామ పంచాయతీల్లో స్థలాలను సేకరించాం. ఇప్పటికే 15 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తయ్యాయి. అనుబంధ గ్రామాల్లో  కూడా ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నాం. హరితహారంలో భాగంగా పనులు చేపడుతున్నాం.

- శ్రీనివాస్‌రావు, మండల పంచాయతీ అధికారి

పర్యావరణానికి దోహదం

 ఎకరా స్థలంలో ఎన్నో రకాల మొక్కలను నాటి పల్లెలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ వనాలు పర్యావరణానికి దోహద పడుతాయి.  జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తాం. 

- తీగల అనితారెడ్డి , జడ్పీచైర్‌పర్సన్‌