బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 14, 2020 , 00:46:57

పచ్చదనమే లక్ష్యంగా..

పచ్చదనమే లక్ష్యంగా..

నియోజకవర్గంలో  జోరుగా మొక్కలు నాటుతున్న నాయకులు

ఇంటింటికీ ఉచితంగా మొక్కలు అందజేస్తున్న అధికారులు

మణికొండ:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మున్సిపాలిటీలో జోరుగా మొక్కలు నాటుతున్నారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  మొక్కలతోనే కాలుష్యం తగ్గుతుందని వివరిస్తున్నారు. భావితరాలకు పచ్చదనంతో కూ డిన పర్యావరణాన్ని అందించాలని తెలుపుతున్నారు.  ని యోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో  ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి  ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు.   గతంలో సీఎం కేసీఆర్‌ రాశిఫలాల ఆధారంగా మొక్కలు నాటితే మంచిదని పేర్కొనడంతో అనేక మంది తమ పేర్లమీద ఏ రకమైన మొక్కలు నాటితే బా గుంటుందనే విషయాలపై పండితుల వద్ద చర్చిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్‌, మణికొండ, నా ర్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీల్లో  ఒక్కో వార్డుకు 22 వేల మొక్కలు నాటాలనే ఉద్దేశంతో  కౌన్సిలర్లు ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఈ సారి 20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.  అవసరమైన మొక్కలను శంషాబాద్‌ మండలం మల్కారంలోని నర్సరీలో పెంచుతున్నారు.  సీమ తంగెడు, ఉసిరి, వేప, దానిమ్మ, గన్నేరు, గులాబీ, మల్లె, మందారం, జామ, ఈత, మారేడు, నిమ్మ, బాదం, మునగ తదితర మొక్కలు నాటుతున్నామని పేర్కొంటున్నారు. 

ప్రజలను భాగస్వాములను చేయాలి

హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలి. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా  మొక్కలు నాటి సం రక్షించాలి.  పండుగలా హరితహారాన్ని నిర్వహించి భావితరాలకు పచ్చదనం అందించాలి. మొక్కలతోనే కాలు ష్యాన్ని తగ్గించవచ్చు.

  -ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్యే, రాజేంద్రనగర్‌

అవగాహన కల్పిస్తున్నాం

మున్సిపాలిటీలో జోరుగా మొక్కలు నాటుతున్నాం. ప్రతిరోజూ వార్డుల్లో అవగాహన కల్పిస్తున్నాం.  గ్రామ గ్రామానా పచ్చదనమే లక్ష్యంగా యువకులు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. ట్రీ గార్డులు ఏర్పా టు చేస్తున్నాం. సీమతంగెడు, ఉసిరి వంటి పలు రకాల మొక్కలు నాటుతున్నాం.

-రేఖ యాదగిరి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌,నార్సింగి