గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 30, 2020 , 00:12:49

పశ్చిమానికి పచ్చటి కళ

పశ్చిమానికి పచ్చటి కళ

ఉద్యానవనాలతో కళకళలాడుతున్న వెస్ట్‌ జోన్‌

ఆహ్లాదాన్ని పంచుతున్న 258 పార్కులు 

ఆకట్టుకుంటున్న  పది ‘థీమ్‌'లు..

హైదర్‌నగర్‌: వెస్ట్‌జోన్‌ పచ్చదనంతో పరవశించిపోతున్నది. ఎటుచూసినా.. పచ్చని అందాలతో అలరారుతున్నది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. వరుసగా రెండేండ్లు పర్యావరణ హిత అవార్డును జోన్‌, జోనల్‌ కార్యాలయం సొంతం చేసుకున్నది. ప్రధానంగా నగరంలోని ఐటీని సింహభాగం కలిగి ఉన్న  ఈ జోన్‌ ఉద్యానవనాలతో కళకళలాడుతున్నది. ఇక్కడి బయోడైవర్సిటీ అధికారులు సైతం గ్రీనరీని  పెంపొందించేందుకు చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. ఇక విభిన్నమైన థీమ్‌లు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.

నాలుగు సర్కిళ్లలో..

శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ పరిధిలో మొత్తం 138 పార్కులున్నాయి. జోన్‌ పరిధిలో నాలుగు సర్కిళ్ల వ్యాప్తంగా ఇవి విస్తరించి ఉన్నాయి. శేరిలింగంపల్లి, చందానగర్‌, ఆర్‌సీపురం, యూసుఫ్‌గూడ సర్కిళ్లు వెస్ట్‌ జోన్‌ పరిధిలోకి రాగా, కీలకమైన పార్కులు ఇక్కడే ఉన్నాయి. నాలుగు సర్కిళ్లలో 120 కాలనీ సంక్షేమ సంఘం ఉద్యానవనాలు ఉండగా,  ఎనిమిది జీహెచ్‌ఎంసీ నిర్వహించేవి, మరో 10 థీమ్‌ పార్కులున్నాయి. వీటిలో శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలో దుర్గం చెరువు, బయోడైవర్సిటీ, బొటానికల్‌ గార్డెన్‌, పాలపిట్ట సైక్లింగ్‌ పార్కు, చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో దీప్తిశ్రీనగర్‌ , యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో కృష్ణకాంత్‌ పార్కులు అతి పెద్దవి. అదనంగా డాగ్‌, సీనియర్‌ సిటిజన్‌, హార్వెస్టింగ్‌, పంచతంత్ర, మియాపూర్‌ సర్కిల్‌ పరిధిలో మల్టీ జనరేషన్‌ పార్కులు ఉన్నాయి. కాగా, కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పార్కులకు నెలకు రూ. 4వేలు వెచ్చిస్తూ..నిర్వహణను కాలనీ సంఘాలే చేపడుతున్నాయి.

ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దుతున్నాం..

వెస్ట్‌ జోన్‌ శేరిలింగంపల్లి వ్యాప్తంగా పార్కులను పచ్చదనాన్ని పెంచేలా, ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దుతున్నాం. వివిధ రకాల థీమ్‌లతో ఉద్యానవనాలు ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఐటీకి వేదికగా శేరిలింగంపల్లి జోన్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ద్ధ్ద తీసుకుంటున్నాం. త్వరలోనే మరికొన్ని భిన్నమైన పార్కులు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి.